చేయతగినవి/ చేయతగనివి

చేయదగినవి :

  • కొండ ఎక్కేటప్పుడు 10 ని.లు తర్వాత 5 ని.లు సేద తీరండి.
  • సన్నిధానం చేరడానికి మరకోట్టం, శరంగుత్తి, నడపందల్ దారినే వాడండి.
  • పదినెట్టాం పడి చేరడానికి క్యూ పాటించండి.
  • నడపందల్ – ఎగువ బ్రిడ్జ్ ని తిరుగు ప్రయాణానికి వాడండి.
  • మల మూత్ర విసర్జనకు ఆయా మరుగుదొడ్లను వాడండి.
  • సన్నిధానంలో ఉన్న గుంపు గురించి తెలుసుకొని పంపనుండి బయలు దేరండి.
  • డోలీలో వెళితే దేవస్వోం బోర్డు లోనే డబ్బు కట్టి రసీదు భద్రపరచుకోండి.
  • సెక్యూరిటీ చెక్ లలో సెక్యూరిటీ సిబ్బందికి సహకరించండి.
  • ఏదైనా సహాయం అవసరమైతే పోళీసులను సంప్రదించండి.
  • ఎవరి పైనైనా అనుమానం వస్తే పోలీసులకు తెలియచేయండి.
  • తిండి పదార్థాలను లైసెన్సులున్న వారి దగ్గరే కొనండి.
  • పంప, సన్నిధానం చేరే మార్గాలలో పరిశుభ్రత పాటించండి.
  • పార్కింగు స్థలాలలో మాత్రమే బళ్ళను పార్క్ చేయండి.
  • వ్యర్ధాలను వాటికి కేటాయించిన డబ్బాలలో వేయండి.
  • వైద్య, ప్రాణవాయు కేంద్రాల సహాయం అవసరమైతే తీసుకోండి.
  • పిల్లలు, వృద్ధులు, మాళిగపురం- లకు చిరునామా, ఫోన్ నెంబర్లు కలిగిన అట్టలను తగిలించండి.
  • తప్పిపోతే వాళ్ళ గుంపు / స్నేహితులు/ భక్తులు పోలీసులకు తెలియచేయండి.
చేయదగనివి:
  • కోవెల పరిసరాలలో మొబైల్ ఫోన్లు వాడకండి.
  • పంప, సన్నిధానం – చేరే మార్గాలలో పొగతాగకండి.
  • మద్యం, ఇతర మత్తు పదార్థాలు వాడకండి.
  • క్యూ మధ్యలో తోసుకొని ముందుకెళ్ళకండి.
  • క్యూలో ఉన్నప్పుడు తోపూడులాటలు చేయకండి.
  • ఆయుధాలు, పేలుడు పదార్థాలు తీసుకు రాకండి.
  • ఆథరైజ్ కాని వర్తకుల దగ్గర కొనకండి.
Security
  • Fire crackers are prohibited
  • Weapons are not allowed.
  • Cooking Gas, Stoves etc. should not be used at Sannidhanam.
  • Fire if lighted should be put out immediately after use.
  • Subject yourself and your baggage for security check before climbing the Pathinettampadi.