శబరిమల గురించి

Lord Ayyappaకేరళలోని అన్ని శాస్తా ఆయలయంలోను అయ్యప్ప కొలువైన శబరిమల శ్రీధర్మశాస్తా ఆలయం చాలా ప్రసిద్ధమైంది. ఈ ఆలయం ఒక కొండమీద (దాదాపు సముద్ర మట్టం నుంచి 3000 అడుగుల ఎత్తున) పతనంతిట్ట జిల్లాలో శబరిమల పేరున వెలయటమే, దాని విశిష్టత.

  ఈ ఆలయంలోని అన్ని మతస్థులకు ప్రవేశం ఉంది. ఆలయ సమీపంలో సన్నిధానానికి అయ్యప్పస్వామి కొలువైన స్థలం తూర్పున వావరేకు కేటాయించబడిన ఒక ప్రాంతం ఉంది. (వ్రావర్ అయ్యప్పస్వామికి ఆప్తమిత్రుడు) దాన్ని వావరునాడ అంటారు, అది మతసామరస్యానికి ప్రతీక. ఈ ఆలయ వైశిష్ట్యాల్లో మరొకటి, ఇది సంవత్సరమంతా తెరిచి ఉంచబడదు. ఈ ఆలయం మండల పూజ, మకరవిళక్కు, విష, ప్రతి మలయాళ మాసం మొదటిరోజు శబరిమలకు వెళ్ళే భక్తులు 41 రోజులు బ్రహ్మచర్యం పాటించాలని చెప్పబడుతోంది. యాత్రకులు అటవీ మార్గంలో పయనిస్తారు, కొంతమంది శారీరిక శ్రమ తక్కువన్న కారణంగా పంబ నుంచి సన్నిధానం చేరుకోనే మార్గాన్ని ఎంచుకొంటారు.