ప్రభుత్వరంగ సేవలు

భక్తుల సురక్షిత పయనం కోసం రక్షణ జోనులు
ఈ రక్షణ జోనులను కేరళ మోటారు బళ్ళ శాఖ, కేరళ రోడ్ల రక్షణశాఖలు కలిసి ఏర్పాటు చేస్తునాయి.  శబరిమలకు వెళ్ళే భక్తుల రక్షణ కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.  భక్తులకు ఈ రక్షణ జోనుల నుంచి దాదాపు 400 కి.మీ. మేరకు ఈ శబరిమల మండలకాలం పూర్తయ్యేదాక ఈ సేవలు లభిస్తాయి.  ఈ రక్షణ జోనుల ఏర్పాటు భక్తులు ఈ శబరిమల మండలకాల దర్శనాన్ని సురక్షితంగా చేసుకోవడం ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటు చేయబడ్డాయి.  

    గురుస్వాములకు, డ్రైవర్లకు రక్షణ జోనుల గురించి 6 భాషలలో చెక్ పోస్టలు, టోల్ భూతులు, ఎడతావళలు మొదలైన  చోట్ల చిన్న వ్యాసరూపంలో సమాచారం ఇవ్వబడుతుంది.  వీటిని గురించి 6 భాషలలో మలయాళం, ఆంగ్లము, హిందీ, తమిళం,  కన్నడ, తెలుగు భాషలలో రక్షణ జోనుల స్థలాలు, పెట్రోలింగ్ దళాల బళ్ళ, వివరాలు రైల్వేస్టేషన్ మొదలైన చోట్ల అనౌన్స్ మెంట్లు చేయబడతాయి.  ఎలవంగాల్ రక్షణ జోను, ప్రధాన కార్యాలయం కాకుండా ఎరుమేలి, కుట్టిక్కాణం అనే రెండు చోట్ల కూడా ఉపకార్యాలయాలు ఉంటాయి.  ఎలవంగాల్, కుట్టిక్కాణం, ఎరిమేలిలలో 24 స్క్వాడ్లు 24 గంటలు పని చేస్తుంటాయి.  యాత్రాస్థలంలో దాదాపు చిన్న పెద్ద కలిపి 1 కోటి బళ్ళు వస్తాయని అంచనా.  ఈ సమయంలో 4 లక్షల  కి.మీ. దూరం పెట్రోలింగ్ చేయబడుతుంది.  పోలీసులతో పాటు, ఆరోగ్యశాఖ, ఆంబులెన్స్ లతో సహా తిరుగుతూ ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా లేదా ఎవరైనా గాయపడిన తర్వతగతిని ఆసుపత్రిలో చేర్చడానికి తయారుగా ఉంటాయి.  ఏ బండికైనా రిపేరు వచ్చిన ఖర్చులేకుండా సరిచేయ బడటమే కాకుండా ట్రాఫిక్ రద్దీ తగ్గించడం కోసం ఆస్థలం నుంచి తొలగించబడుతుంది.  టైర్ పంచర్, మెబైల్ రిపేరు యూనిట్లు ఎలవంగాల్ నుండి దాదాపు 40 టన్నుల బళ్ళుకు రిపేరు చేసేవి తిరుగుతూ ఉంటాయి.  అంతే కాకుండా 90 మెకానికల్ టీమ్ లు 35 ఆటోమేకర్లు తయారుగా ఉంటారు.

రక్షణజోన్: అత్యవసర నెంబర్లు
శబరిమల మండల, మకరవిళక్కు దాకా వచ్చే భక్తుల రక్షణ కోసం రక్షణ జోనుల  ప్రాజెక్టు ఏర్పాటయింది.  భక్తుల కోసం జోనుల హెల్ప్ లైన్ నెంబర్లను ఏ అత్యవసరస్థితిలో లేదా బళ్ళ రిపేరు, య్యాక్సిడెంట్లకైనా ఉపయోగించవచ్చు.

ఎళవంగాల్ – 09400044991, 09562318181
ఎరుమేలి – 09496367974, 08547639173
కుట్టిక్కాణం – 09446037100, 08547639176
ఇమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
safezonesabarimala@gmail.com