ఉపదేవతలు

నాగరాజావ్:
నాగరాజావ్ దైవాన్ని గర్భగుడిలోకి ప్రక్కనే ఉంటుంది. భక్తులు సన్నిధానంలో అయ్యప్పను, కన్నిమూలగణపతిని దర్శించిన  శ్రీరోవిల్ తర్వాత నాగరాజావ్ ను దర్శించి మొక్కులు చెల్లిస్తారు. 

వావరునాడ:
వావర్, వావరుస్వామి కూడా పిలవబడతాడు.  వావరు ఒక ముస్లీం తాఅపసి, తర్వాత అయ్యప్పస్వామి భక్తుడయ్యాడు.  వావరుస్వామికి శబరిమలలో ఒక గుడి ఉంది.  అలాగే, ఎరుమేలిశాస్తా గుడి పక్కనే ఒక మసీదు కూడా ఉంది.  వావరుస్వామికి అయ్యప్పమీదున్న భక్తి, భక్తులు శబరిమల యాత్రాకాలంలో ఎరుమేలి మసీదును దర్శించటం అన్నవి కేరళలోని మత సామరస్యానికి ఉదాహరణలు.  అయ్యప్ప మీద వావరుకున్న భక్తి అయ్యప్పభక్తి అన్ని మతాలకు సమానమనీ, అందరూ సమానమనీ, హిందువులు, ముస్లీములు, క్త్రెస్తవులనే భేదం లేకుండా అందరూ అయ్యప్పభక్తులే అనీ తెలుయచేస్తుంది.
మాళిగపురత్తమ్మకు ప్రధానంగా సమర్పించేవి పసుపుపొడి, కుంకుమ, చెక్కెర, తేనె, అరటిపండు, ఎఱ్ఱని వస్త్రం.

మాలిగపురత్తమ్మ:
శబరిమలలోని ఉపదేవతలలో మాళిగపురత్తమ్మ ముఖ్యదేవత.  మాళిగపురత్తమ్మను గురించి రెండు నమ్మకాలు అయ్యప్పతో పోరాడిన మహిష అనే పేరుగల రాక్షసి .  రాక్షసి ఓడిపోవడంతో ఒక అందమైన స్త్రీగా మారి అయ్యప్ప గురువుగారి కుమార్తె సన్యాసినిగా మారి అయ్యప్పతోనే ఉండిపోవాలని కోరుంది అనీ; తాంత్రిక పద్ధతిలో భక్తులు మాళిగ పురత్తమ్మను ’ఆదిపరాశక్తి’గా కొలవాలి.

కఱుప్పుసామి:  కఱుప్పుసామి అమ్మ :
కఱుప్పుసామి సన్నిధి పదునెనిమిది పవిత్ర మెట్లు కుడి పక్కన ఉంటుంది.  ఆ నన్నిధిలోనే కఱుప్పాయ అమ్మ కూడా ఉంటుంది.   వాళ్ళిద్దరూ అయ్యప్పస్వామి పుణ్యయాత్రలో అడవిలో సహాయ పడ్డారనీ, వాళ్ళకు మహిమలున్నాయని నమ్మకం. 

వలియ కడత్త సామి:
వలియకడూత్తసామి సన్నిధి పదునెనిమిది పవిత్ర మెట్ల ఎడమ పక్కన ఉంటుంది.  ఈయన కూడా అయ్యప్ప బంటుగా భావించబడుతాడు.

మేల్ గణపతి :
గర్భగుడికి పక్కన ఉండే సన్నిధి మేల్ గణపతి సన్నిధానంలోనే ఉంది.  నెయ్యి కొబ్బరి కాయలోని సగాన్ని భక్తులు ఇక్కడ గణపతికి ఆళిలో అర్పిస్తారు.