చేయదగినవి : కొండ ఎక్కేటప్పుడు 10 ని.లు తర్వాత 5 ని.లు సేద తీరండి. సన్నిధానం చేరడానికి మరకోట్టం, శరంగుత్తి, నడపందల్ దారినే వాడండి. పదినెట్టాం పడి చేరడానికి క్యూ పాటించండి. నడపందల్ – ఎగువ బ్రిడ్జ్ ని తిరుగు ప్రయాణానికి వాడండి. మల మూత్ర విసర్జనకు ఆయా మరుగుదొడ్లను వాడండి. సన్నిధానంలో ఉన్న గుంపు గురించి తెలుసుకొని పంపనుండి బయలు దేరండి. డోలీలో వెళితే దేవస్వోం బోర్డు లోనే డబ్బు కట్టి రసీదు భద్రపరచుకోండి. సెక్యూరిటీ చెక్ లలో సెక్యూరిటీ సిబ్బందికి సహకరించండి. ఏదైనా సహాయం అవసరమైతే పోళీసులను సంప్రదించండి. ఎవరి పైనైనా అనుమానం వస్తే పోలీసులకు తెలియచేయండి. తిండి పదార్థాలను లైసెన్సులున్న వారి దగ్గరే కొనండి. పంప, సన్నిధానం చేరే మార్గాలలో పరిశుభ్రత పాటించండి. పార్కింగు స్థలాలలో మాత్రమే బళ్ళను పార్క్ చేయండి. వ్యర్ధాలను వాటికి కేటాయించిన డబ్బాలలో వేయండి. వైద్య, ప్రాణవాయు కేంద్రాల సహాయం అవసరమైతే తీసుకోండి. పిల్లలు, వృద్ధులు, మాళిగపురం- లకు చిరునామా, ఫోన్ నెంబర్లు కలిగిన అట్టలను తగిలించండి. తప్పిపోతే వాళ్ళ గుంపు / స్నేహితులు/ భక్తులు పోలీసులకు తెలియచేయండి. చేయదగనివి: కోవెల పరిసరాలలో మొబైల్ ఫోన్లు వాడకండి. పంప, సన్నిధానం – చేరే మార్గాలలో పొగతాగకండి. మద్యం, ఇతర మత్తు పదార్థాలు వాడకండి. క్యూ మధ్యలో తోసుకొని ముందుకెళ్ళకండి. క్యూలో ఉన్నప్పుడు తోపూడులాటలు చేయకండి. ఆయుధాలు, పేలుడు పదార్థాలు తీసుకు రాకండి. ఆథరైజ్ కాని వర్తకుల దగ్గర కొనకండి. Security Fire crackers are prohibited Weapons are not allowed. Cooking Gas, Stoves etc. should not be used at Sannidhanam. Fire if lighted should be put out immediately after use. Subject yourself and your baggage for security check before climbing the Pathinettampadi.