Nilakkal Mahadeva Temple

నీలక్కల్ లో నెలకొని ఉంది, ఈ నీలక్కల్ మహాదేవ ఆలయం. ఈ గుడిలో ప్రథాన దైవం శివుడు, ఇది శబరిమలకు వెళ్ళే భక్తులకు ఒక ఇడతావళం. ఈ ఆలయం ట్రావన్కూర్ దేవస్వోమ్ బోర్డు అధీనంలో ఉంది. శబరిమల యాత్రా కాలంలో ఎక్కువగా భక్తులు దర్శించుకొంటారు.

ఈ గుడిలో శివుడు ఉగ్రమూర్తిగానూ, మంగళప్రదాయకంగానూ రెండు రూపాలుగా కనిపించడం విశేషం. శివుడు తన పుత్రుడైన అయ్యప్పపై ప్రేమ,కరుణ కురిపిస్తూనే, భూతప్రేతాదులమీద కోపాన్ని చూపిస్తాడని నమ్మకం. అనేక శివలాయలలో లాగే చాలా నంది మూర్తులు ఆలయ రక్షిస్తుంటాయి.

ఉపదేవతలు ఇక్కడ రెండే ఒకటి కన్నిమూలగణపతి, మరొకటి నంది.

ప్రతిరోజు మూడు పూజలు నిర్వహింపబడతాయి. పగలు ఉషపూజ, మధ్యాహ్నం ఉచ్చపూజ, సాయంకాలం దీపారాధనతో పూర్తవుతుంది. వారంలో ఆదివారం, సోమవారం, శుక్రవారం ప్రధానమైనవి.
ఇక్కడ జరిగే ప్రధాన పండుగ మహాశివరాత్రి. దానితో పాటు ప్రతి ఏడు తిరు ఉత్స్వం విశేషంగా జరుపుతారు. శబరిమలయాత్రాకాలంలో అనేక చోట్లనుంచి భక్తులు వచ్చి సేవిస్తారు.

 

సంప్రదించండి

ఈ వెబ్ స్తైట్ లోని విషయంలో మార్పులు చేసే సూచనలకు,
దయచేసి ఈ మెయిల్ చేయండి: webprd@kerala.gov.in

Connect us

హెల్ప్ లైన్

er

Updated Schedule

 

  • పోలీసుకంట్రోల్ గది, హెల్ప్ లైన్ శబరిమల:
    04735-202100, 04735-202016

  • పోలీసు స్పెషల్ ఆఫీసరు:
    04735- 202029

  • మోటా వెహికల్ డిపార్ట్మెంట్:
    9400044991, 9562318181